హైద్రాబాద్ కుర్రాడి  బుల్లెట్ రైలు లోగో - MicTv.in - Telugu News
mictv telugu

హైద్రాబాద్ కుర్రాడి  బుల్లెట్ రైలు లోగో

October 30, 2017

బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం  నిర్వహించిన లోగో పోటీల్లో, హైద్రాబాద్‌కు చెందిన ఆళ్ల చక్రధర్ అనే కుర్రాడు  తయారు చేసిన లోగో ఎంపికైంది. అహ్మదాబాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో చదువుకుంటున్న చక్రధర్ ఇది వరకే లోగో పోటీల్లో 30 సార్లు పాల్గొన్నాడు. కానీ 31 వ సారి, అతనికి విజయం వరించింది.

చిరుతపులి వేగాన్ని, బుల్లెట్ రైలు వేగంతో అనుసంధానం చేస్తూ చక్రధర్ లోగో డిజైన్ చేశాడు.  చిరుత వేగానికి ప్రతీక కాగా, దానిపై ఉన్న రైలు ఆకారం నమ్మకానికి (వేగం నమ్మకం) నిదర్శనమని చ‌క్ర‌ధ‌ర్ వివ‌రించాడు.  లోగోలు తయారుచేయడంలో  చక్రధర్‌కి ఉన్న అమితాసక్తి కారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు అతనిని  ‘లోగోమ్యాన్‌’గా పిలుస్తారట.