ఈ రోజూ బంగారం ఢమాల్.. వెండిదీ అదే బాట - MicTv.in - Telugu News
mictv telugu

ఈ రోజూ బంగారం ఢమాల్.. వెండిదీ అదే బాట

September 23, 2020

Bullion gold and silver prices drops fall

కొండెక్కిన బంగారం ధరలు జర్రున జారుకుంటూ దిగొస్తున్నాయి. ఈ రోజు కూ పసిడి ధర భారీగా పతనమైంది. ఎంసీఎక్స్ అక్టోబర్ ఫ్యూచర్స్ మార్కెట్లో రూ. 50 వేల దిగువకు పడిపోయింది. రూ. 405 తగ్గి రూ. 49,976కు చేరుకుంది.  వెండి ధరలు కూడా పతనమయ్యాయి. డిసెంబర్ ఫ్యూచర్స్‌లో కేజీకి రూ. 1,890 పడిపోయి రూ. 59,323గా ధర నిలిచింది. హైదరాబాద్ మార్కెట్లో  22 కేరట్ల బంగారం రూ. 700 తగ్గి రూ. 48,100కి పడిపోయింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం కూడా రూ. 760 తగ్గి రూ. 52,470కి పడిపోయింది. వెండి ధర కూడా భారీగా పతనమైనంది. కేజీకి ఏకంగా  రూ. 1600 పడిపోయి రూ. 59,00 వద్ద స్థిరపడింది. రెండు నెలల కిందట వాయివేగంతో పరిగెత్తిన రజతం ధరలు డిమాండ్ లేక బొక్కబోర్లా పడ్డాయి. 

డాలరు ధర బలపడ్డంతో పెట్టుబడిదారులు షేర్ మార్కెట్ వైపు మళ్లుతుండడం తెలిసిందే. కరోనాకు టీకా వచ్చేసిందని రష్యా చెప్పినప్పటి నుంచి బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గడం, వ్యాపారాలు నెమ్మదిగా ఊపందుకోవడంతో పెట్టుబడిదారులు బంగారంపైపు చూడ్డం లేదు. రెండు నెలల కిందట బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 కేరట్ల బంగారం ఏకంగా రూ. 54 వేలు,  24 కేరట్ల బంగారం 60 వేలు దాటేసి బెంబేలు పుట్టించింది. వెండి ధర కూడా కేజీకి రూ. 77 వేలు పలికి భారీగా పతనమవుతూ వస్తోంది.