జ్యోతిష్కులకు బంపర్ ఆఫర్.. పదివేల ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

జ్యోతిష్కులకు బంపర్ ఆఫర్.. పదివేల ఉద్యోగాలు

June 29, 2022

జ్యోతిష్యం చెప్పే వాళ్లంటే కొంతమందికి విపరీతమైన నమ్మకం. మరికొంతమందికి వారు చెప్పేదంతా సోది అని అనిపిస్తుంది. అయితే జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ల కోసం ఓ ఆన్‌లైన్ ఆప్ వచ్చింది. దాని పేరు ఆస్ట్రోటాక్. దీనిని పునీత్ గుప్తా అనే వ్యక్తి నెలకొల్పారు. సొంత వనరులతో ప్రారంభమైన ఈ సంస్థ గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఇప్పటివరకు 3500 మంది జ్యోతిష్కులను నియమించుకుంది. కంపెనీ వార్షిక బడ్జెట్ రూ. 72 కోట్లు కాగా, నెలకు సగటున రూ.4 కోట్లు మాత్రమే వినియోగించగలుగుతోంది. వార్షికాదాయం రూ. 200 కోట్లు కాగా, దానిని రూ. 400 కోట్లకు పెంచుకోవాలని అనుకుంటోంది. ఇందుకు దాదాపు పదివేల మంది జ్యోతిష్కుల అవసరమవుతారని, ఈ ఏడాది చివరి నాటికి వారిని రిక్రూట్ చేసుకుంటామని పునీత్ గుప్తా వెల్లడించారు. మార్కెటింగ్, సాంకేతికత, శిక్షణ, రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ ద్వారా కంపెనీ ఉద్యోగులను కూడా పెంచుకోవాలని చూస్తున్నట్టు ఆయన వివరించారు. సో, ఇంతకాలం స్వయం ఉపాధిగా ఉన్న జ్యోతిష్యం ఇకపై ఉద్యోగంగా మారనుందన్నమాట. అయితే దీనివల్ల మంచి ఫలితాలు వస్తే మంచిదే కానీ, మూఢనమ్మకాలను ప్రోత్సహించేలా ఉండకూడదని ఆశిద్దాం.