ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. వందకార్లు అందజేత - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. వందకార్లు అందజేత

April 12, 2022

CAR

ప్రైవేట్ ఉద్యోగం అంటే టైంకి ఆఫీసుకు వెళ్ళటం. కంపెనీ వారు సూచించిన టైంకే లంచ్ చేయటం. కంపెనీ ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయటం. కరెక్ట్ టైంకి లాగౌట్ కావటం. కొన్ని సందర్భాలలో టార్గెట్ పూర్తి కాకపోతే, ఎక్స్‌ట్రా టైం వర్క్ చేయటం వంటివి ఉంటాయి. అంతేకాకుండా, కంపెనీ వారు నిర్ణయించిన టైంకి ఆఫీసుకి వెళ్లకపోతే, జాబ్ నుంచి ఎప్పుడు తీసేస్తారోనని ఒక్కటే టెన్షన్ ఉంటుంది. ఒకవేళ కంపెనీ రూల్స్‌ను ఫాలో అయ్యి, సంవత్సరాలపాటు వర్క్ చేస్తే, బెస్ట్ ఎంప్లాయిగా ఏదో ఒక బహుమతిని ఇచ్చి, సర్టిఫికెట్‌ను అందజేస్తారు.

కానీ, చెన్నై రాష్ట్రంలో ఐడియాస్ 2 ఐటీ అనే ఇంజినీరింగ్ సంస్థ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంస్థ అభివృద్దికి సేవలు అందించినందుకు మొత్తం వంద మంది ఉద్యోగులకు వంద కార్లను బహుమానంగా అందించింది. దీంతో ఉద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగుల కుటంబసభ్యులు కంపెనీ ఇచ్చిన కార్లలో తమ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ, కంపెనీ సీఈఓలకు ధన్యవాదాలు తెలిపారు.