బంపర్ ఆఫర్.. హెల్మెట్ ఉంటే నో చెకింగ్  - MicTv.in - Telugu News
mictv telugu

బంపర్ ఆఫర్.. హెల్మెట్ ఉంటే నో చెకింగ్ 

September 13, 2019

No checking if helmet...

రోడ్డుపై వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వాహన చోదకులకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ అని అంటున్నారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనచోదకులను ఇతర పత్రాల కోసం ఆపి తనిఖీ చేయవద్దని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. హెల్మెట్‌ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని, హెల్మెట్ వాడకాన్ని మరింత పెంపొందించడానికి కృషి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

ఈ క్రమంలో హెల్మెట్ ధరించిన వాహన చోదకులకు తదుపరి ఆదేశాల వరకు తనిఖీల నుంచి కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మాత్రం సహించవద్దని అన్నారు. అలాంటివారికి జరిమానాతో పాటు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తనిఖీ చేయాలని, పత్రాలు లేనిపక్షంలో అన్నింటికి కలపి జరిమానా తప్పనిసరిగా విధించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.