జియో సిమ్ రిచార్జ్ చేసుకుంటే బంపర్ ఆఫర్...! - MicTv.in - Telugu News
mictv telugu

జియో సిమ్ రిచార్జ్ చేసుకుంటే బంపర్ ఆఫర్…!

August 16, 2017

మూడు నెలలు పుక్కట్ల నెట్టు ఫ్రీ,కాల్స్ ఫ్రీ అంటే ఎవ్వలూకుంటరు, ఒక్కొక్కలు ఎగవడి ఎగవడి మరీ మూడు నాల్గు జియో సిమ్ములు తీస్కొని..వాడకం అంటే ఏంటిదో జూపిచ్చిన్రు కదా,ఇగ తర్వాత ఏక్ధంన  పుక్కట్ల బందై..రీచార్జ్ లు జేస్కోవాలే అని రిలయన్సోళ్లు చెప్పంగనే ఒక్కొక్కలకైతే పాణం పోయినంత పనైంది.అల్వాటైన పానమాయే ఊకుంటమా…ఇప్పుడు రిచార్జ్ చేస్కొని  వాడుకుంటున్నం.

రిచార్జ్ చేస్తే కొన్ని పైసల్ వాపస్..!

పేటీఎం, ఫోన్‌పే, మొబిక్విక్, అమెజాన్ పే వంటి డిజిటల్ వాలెట్ లు జియో సిమ్ రిచార్జ్ మీద క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నయి..

పేటీఎం…

పేటీఎం వాలెట్ ద్వారా జియో సిమ్ రీచార్జి చేసుకుంటే రూ.100కు రూ.15 క్యాష్ బ్యాక్ వస్తదట.అదే రూ.300 ఆపైన ప్లాన్ రీచార్జి చేసుకుంటే రూ.76 క్యాష్‌బ్యాక్ లభిస్తుందట. రీచార్జి చేసుకున్న 24 గంటల తరువాత యూజర్ పేటీఎం వాలెట్‌లో క్యాష్‌బ్యాక్ డబ్బు క్రెడిట్ అవుతుంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే రీచార్జి చేసుకునేటప్పుడు యూజర్లు PAYTMJIO ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఫోన్‌పే…

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే వాలెట్ ద్వారా రిలయన్స్ జియో సిమ్‌కు గాను రూ.300 ఆపైన ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే రూ.75 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంది. పేటీఎం లాగే రీచార్జి చేసుకున్న 24 గంటల తరువాత ఫోన్‌పే వాలెట్‌లో నగదు క్రెడిట్ అవుతుంది.

మొబిక్విక్…

ఈ వాలెట్‌లో రూ.399 ప్లాన్‌తో జియో రీచార్జి చేసుకుంటే రూ.59 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. JIOMBK ప్రోమో కోడ్ వాడాల్సి ఉంటుంది. అయితే మొబిక్విక్‌ను కొత్తగా వాడేవారు NEWJIO కోడ్‌ను ఎంటర్ చేస్తే రూ.159 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

అమెజాన్ పే…

అమెజాన్ డిజిటల్ వాలెట్ అమెజాన్ పే లో రూ.309 ఆపైన ప్లాన్‌తో జియో రీచార్జి చేసుకుంటే రూ.99 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ నెల 19వ తేదీ వరకు ఆఫర్ కొనసాగుతుంది. అయితే యూజర్ రీచార్జి చేసుకున్నాక క్యాష్ బ్యాక్ నగదు 7 రోజుల్లో అమెజాన్ పే వాలెట్‌లో క్రెడిట్ అవుతుంది. ఆ తరువాత చేసుకునే రీచార్జిలపై కూడా రూ.20 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

అబ్బా నేను నిన్ననే రిచార్జ్ జేశ్న గీ ముచ్చటేందో ముందు జెప్పద్దా అంటరు కదా..గీ ఆఫర్ గీ ఒక్కనెలల్నే గాదు నవంబర్ 30వ తేదీ వరకు ఉంటదట.