6వ అంత‌స్తు నుంచి నోట్ల వర్షం కురిసింది..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

6వ అంత‌స్తు నుంచి నోట్ల వర్షం కురిసింది..వీడియో

November 21, 2019

పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా..? డబులు ఏమైనా ఆకాశం నుంచి ఊడి పడుతున్నాయా? సాధారణంగా ఎవరినైనా డబ్బు అడిగినప్పుడు ఈ మాటలు మనం వింటూ ఉంటాం. అవి ఎప్పటికీ నిజం కావనుకుంటాం. కానీ, పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని బెంటిక్ స్ట్రీట్‌లో నిజమైనది. పైసలు చెట్లు, ఆకాశం కాదు కానీ.. ఓ భవంతిలోని ఆరో అంతస్తు నుంచి వర్షంలా కురిసాయి. 

ఇంతకీ ఏం జరిగిందంటే..డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం ఓ భవనంపై దాడులు చేపట్టారు. అందులోని ఆరో అంతస్తులో ఎక్సపోర్ట్స్-ఇంపోర్ట్స్ వ్యాపారం నిర్వహించే హోక్యూ మర్క‌న్‌టైల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పన్ను చెల్లించకపోవడంతో అధికారులు దాడులు చేశారు. వారి రాకను గమనించి… సంస్థ నిర్వాహకులు రూ.2,000, రూ.500, రూ.100 నోట్ల క‌ట్ట‌ల‌ను బిల్డింగ్ నుంచి విసిరేసిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిని అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. డబ్బు వెదజల్లే బదులు సుంకం కట్టిఉంటే ఈ తిప్పలు ఉండేవి కాదు కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు కేసును న‌మోదు చేశారు.