Bundy Sanjay seeks governor to direct DGP to take action against police for beating landless people
mictv telugu

భూనిర్వాసితులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోండి.. గవర్నర్‌కు బండి వినతి

June 15, 2022

Bundy Sanjay seeks governor to direct DGP to take action against police for beating landless people

హుస్నాబాద్ పరిధిలోని గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులలో భూమిని కోల్పోతున్న నిర్వాసితులపై దాడికి దిగిన పోలీసులపై చర్యలకు డీజీపీని ఆదేశించాలని కోరుతూ టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గవర్నర్ తమిళిసైని కోరారు. లాఠీచార్జీ చేసిన పోలీసులపై కఠిన చర్యలకు ఆదేశించాలని వినతిపత్రం అందించారు. ఈ మేరకు బుధవారం పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి కలిశారు.

పరిహారం విషయంలో భూనిర్వాసితులు చేపట్టిన ఆందోళనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. దీందో బండి సంజయ్ కూడా వారిని పరామర్శించారు. ఇక, మెరుగైన పరిహారంతో నిర్వాసితుల సమస్యను పరిష్కరించి, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా గవర్నర్‌ను కోరారు.