అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం భారీ విజయం సాధించింది. ఈ జోష్‌లో ఉన్న టీం.. దాని సీక్వెల్ పుష్ప 2 చిత్రీకరణపై దృష్టి పెట్టింది. మొన్నటివరకు హైదరాబాదులో షూటింగ్ జరుపగా, తదుపరి షెడ్యూల్ కోసం వైజాగ్‌కి షిఫ్ట్ అయ్యింది. అల్లు అర్జున్ ఇప్పటికే వైజాగ్ వెళ్లిపోగా, కొద్ది రోజుల్లో రష్మికా మందన్నా కూడా షూటింగ్లో జాయిన్ అవనుంది. ఇదిలా ఉండగా, నిర్మాత బన్నీవాసు అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏకంగా పుష్ప 2 సినిమా షూటింగ్ చూసే అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించాడు.
వివరాల్లోకెళితే.. కిరణ్ అబ్బవరం హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానరుపై ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే చిత్రం తెరకెక్కింది. తిరుపతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ‘ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా బన్నీవాసు మాట్లాడుతూ ‘ఈ పాటకు రీల్ తయారు చేసి గీతా ఆర్ట్స్‌ను ట్యాగ్ చేయండి. ఎంపికైన పది మందికి వాళ్ల కుటుంబంతో సినిమా చూపించడమే కాకుండా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగుకు తీసుకెళ్తామ’మని ప్రకటించాడు. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. మురళి కిషోర్ అబ్బూరి తొలిసారి దర్శకుడిగా పరిశ్రమకు పరిచయమవుతున్నాడు.