బీజేపీ మిత్రపక్షాలకు అమిత్ షా విందు - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ మిత్రపక్షాలకు అమిత్ షా విందు

May 20, 2019

ఆదివారం రోజున దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తదనంతరం వివిధ న్యూస్ చానళ్ళు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించాయి. వాటి ప్రకారం మరోసారి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం అవుతోంది. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడితే తప్ప తెలియదు అసలు విజేత ఎవరో. ప్రస్తుతానికి ఎన్డీయే కూటమిదే అధికారమని భావిస్తున్న తరుణంలో రేపు ఎన్డీఏలోని అన్ని పార్టీల నేతలను విందు ఇవ్వనున్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా. ఇక రేపు కేంద్రమంత్రులు కూడా సమావేశమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఫలితాలకు రెండు రోజుల ముందు ఎన్డీఏ పక్షాలకు విందు ఏర్పాటు చేసిన అమిత్‌షా.. ఎన్నికల ఫలితాల తర్వాత వ్యవహరించాల్సిన తీరుపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.