తగలబెట్టుకుని ప్రపోజ్ చేశాడు... అదో సరసం - MicTv.in - Telugu News
mictv telugu

తగలబెట్టుకుని ప్రపోజ్ చేశాడు… అదో సరసం

August 13, 2020

Burned and love proposed ... Fight master love stunt .

లేటు వయసులో ఘాటు ప్రేమ అన్నారు. ఓ స్టంట్ మాస్టర్ తన ప్రేమను వ్యక్త పరచడానికి తనకు తెలిసిన విద్యలోనే ప్రపోజ్ చేశాడు. ఒంటికి నిప్పు అంటించుకుని ప్రియురాలి ముందు ప్రత్యక్షం అయి ‘నన్ను ప్రేమించు ప్రియురాలా’ అని కోరాడు. దీంతో ఆమె షాక్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సినిమాల్లో స్టంట్లు చేసుకుంటున్న 52 ఏళ్ల రికీ అనే ఫైట్ మాస్టర్‌కు అది తప్ప వేరే ప్రపంచం తెలియదు. 

అతని ప్రపంచంలోకి ఓ 48 ఏళ్ల మహిళ వచ్చింది. ఆమెను తనవైపునుంచి పిచ్చపిచ్చగా ప్రేమించాడు. ఏదో ఒకరోజు తన ప్రేమను ఆమెకు వ్యక్తపరచాలనుకున్నాడు. ఎలా ప్రపోజ్ చేయాలో తెలియక బాగా ఆలోచించాడు. తాను ప్రపోజ్ చేస్తే ఆమె అస్సలు తిరస్కరించకూడదు అనుకున్నాడు. ఈ క్రమంలో తనకు తెలిసిన స్టంట్ విద్యనే నమ్ముకున్నాడు. వెంటనే ఒంటికి మంట అంటించుకున్నాడు. ఆ మంటలతో వెళ్లి తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఆ మంటలను చూసి ఆమె షాక్ అయ్యింది. ఏం చెప్పాలో తెలియక కొయ్య బొమ్మలా బిగదీసుకుపోయింది. ఎక్కువ ఆలస్యం చేస్తే అతని ప్రాణానికి ప్రమాదం అని భావించి వెంటనే అతని ప్రపోజ్‌కు ఒప్పుకుంది. కాగా, ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.