టేకాఫ్‌‌లోనే కాలిపోయిన విమానం..122 మంది.. - MicTv.in - Telugu News
mictv telugu

టేకాఫ్‌‌లోనే కాలిపోయిన విమానం..122 మంది..

May 12, 2022

కరోనాతో అతలాకుతలం అవుతున్న చైనా దేశంలో మరో విమాన ప్రమాదం జరిగిన సంఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తు విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అధికారులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

 

అధికారులు మాట్లాడుతూ..”టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చైనాలోని సౌత్‌వెస్ట్‌ చాంగ్‌కింగ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గురువారం ఉదయం టిబెట్‌లోని న్యింగ్‌చికి వెళ్లాల్సి ఉంది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలెట్‌ గుర్తించాడు. వెంటనే సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకుని, ల్యాండ్‌ చేశాడు. ల్యాండింగ్‌ చేసిన తర్వాత అది కంట్రోల్‌ తప్పి, రన్‌వే దాటి వెళ్లిపోయింది. దాంతో విమానం రెక్కలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తంగా ఉన్న విమానాశ్రయ సిబ్బంది అందులోని ప్రయాణికులని, సురక్షితంగా కాపాడారు. విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు.”

ఇటీవలే చైనాలో మార్చి 12న కున్మింగ్ నుంచి గాంఝా వెళ్తోన్న విమానం గుయాం ప్రాంతంలో కుప్పకూలి, 132 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి అలాంటి మరో ఘటనే చోటుచేసుకోవడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.