కంటెయినర్‌లో 20 ఎలక్ట్రిక్ స్కూటర్ల దగ్ధం.. కేంద్రం దర్యాప్తు - MicTv.in - Telugu News
mictv telugu

కంటెయినర్‌లో 20 ఎలక్ట్రిక్ స్కూటర్ల దగ్ధం.. కేంద్రం దర్యాప్తు

April 13, 2022

7

ఎలక్ట్రిక్ స్కూటర్లను మహారాష్ట్రలోని నాసిక్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న కంటెయినర్‌‌లో మంటలు చెలరేగడంతో 20 స్కూటర్లు దగ్ధమయ్యాయి. జితేంద్ర న్యూ ఈవీ టెక్ కంపెనీకి చెందని ఈ 40 స్కూటర్లు ఫ్యాక్టరీ గేటు దాటగానే మంటలు అంటుకోవడంతో 20 స్కూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు కంపెనీ తెలిపింది. కారణమేంటో తెలసుకుంటామని ప్రకటించింది. కాగా, వరుసగా ఇలాంటి ఘటనలు దేశంలో జరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో అధ్యయనం చేసేందుకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఇదేకాక, ఈ మధ్య ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. మార్చి 26న పుణెలో ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం కాలి పోయింది. అదేరోజు తమిళనాడులో ఒకినావా స్కూటరు ఛార్జింగ్ పెట్టగా అర్ధరాత్రి మంటలు అంటుకున్నాయి. 28న తిరుచ్చిలో, మరుసటి రోజు చెన్నైలో ఇలాంటి ఘటనలు జరిగాయి. పెట్రోలు రేట్లు పెరుగుతున్నందున పర్యావరణ హితమైన ఎలక్ట్రిల్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తుండగా, ఇలాంటి వరుస ఘటనల వల్ల ప్రజల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. నాణ్యమైన బ్యాటరీలను ఉపయోగించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.