మంచిర్యాలలో బస్సు ప్రమాదం.. 20 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

మంచిర్యాలలో బస్సు ప్రమాదం.. 20 మందికి గాయాలు

May 17, 2019

మంచిర్యాల జిల్లాలో ఈ రోజు మధ్యామ్నం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. జైపూర్ పవర్ ప్లాంటు వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. 20 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.