సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్ళేవారికి ఇబ్బందలు తప్పేలా కనిపించడం లేదు. ముందస్తు రిజర్వేషన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే బస్సులతో పాటు విజయవాడ నుంచి రాజమండ్రి, కాకినాడ, ఉత్తరాంధ్రలోని విశాఖలకు వెళ్లే బస్సులు, రైళ్లలో టిక్కెట్లన్నీ ఇప్పటికే బుకింగ్స్ అయ్యాయి. అలాగే తిరుగు ప్రయాణంలో 14, 15, 16 తేదీల్లో ఆయా ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సుల్లో కూడా టిక్కెట్లన్నీ దాదాపుగా అయిపోయాయి. కొద్డి బస్సుల్లో మాత్రమే కొన్ని సీట్లు ఖాళీగా చూపిస్తుండగా, మరో రెండ్రోజుల్లో అవి కూడా బుక్కయ్యే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఇక రైళ్లలో అయితే బెర్తులన్నీ ఫుల్ అయిపోయాయి. ఏ రైలు చూసినా చాంతాండంత వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. దాంతో ధర ఎక్కువైనా తత్కాల్ లో టిక్కెట్ల కోసం ప్రయాణీకులు ఎదురుచూస్తున్నారు.
ప్రతీ సంవత్సరం ఇదే పరిస్థితులు నెలకొంటున్నా ఈ సారి అన్ని బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉండనుండడంతో డిమాండ్ కాస్త ఎక్కవయింది. దీన్ని తట్టుకునేందుకు ఏపీ ఆర్టీసీ వెయ్యి బస్సులను అదనంగా నడిపేందుకు సిద్ధమైంది. ముందుగా పండుగకు ముందు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆ తర్వాత విజయవాడ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఈ బస్సులను నడపనుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించనుంది. అటు రైల్వే శాఖ మాత్రం ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉన్నా అదనపు రైళ్లు కానీ, కోచ్ లు కానీ ఏర్పాటు చేయట్లేదు. కొన్ని రైళ్లకు మాత్రం అదనపు కోచ్ లు ఏర్పాటు చేస్తున్నట్టు తూతూ మంత్రంగా ప్రకటించినా స్పెషల్ రైళ్లు మాత్రం అందుబాటులో లేవనే చెప్పాలి. పై పరిణామాలతో ప్రయాణీకులకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఇవి కూడా చదవండి :
ఇకపై చంద్రబాబు కేసీఆర్ను ఆడుకుంటారు.. జగ్గారెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టు కీలక తీర్పు