నదిలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు..24 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

నదిలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు..24 మంది మృతి

February 26, 2020

 

hvhn vhbm

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి అతిధులను తీసుకెళ్తున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా బుండి జిల్లాలోని లఖేరీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై నుంచి బస్సు అదుపు తప్పి మెజ్ నదిలో పడింది. 

డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం  జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ఉన్నారని సమాచారం. కోటా నుంచి సవాయ్‌మాధోపూర్ వెళ్తుండగా.. ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.