కండక్టర్..అమ్మ  డ్యూటీ ఒకేసారి...! - MicTv.in - Telugu News
mictv telugu

కండక్టర్..అమ్మ  డ్యూటీ ఒకేసారి…!

August 12, 2017

చంటిబిడ్డను భుజాన వేస్కొని  టికెట్లు కొడుతున్న ఈమె పేరు అలియజహన్,ఊరు.. సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరంపేట్…రోజుకు 8 గంటలు పాటు బిడ్డను బుజంమీద వేసుకుని కండక్టర్ డ్యూటీ చేస్తుంది,తనతో పాటు భర్త కూడా డ్యూటీ చేస్తుండడం,బిడ్డను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం దీనకి కారణం…మెటర్నిటీ సెలవులు అయిపోయాయట…మళ్లీ లీవ్ పెడితే..చేస్తున్న కాంట్రాక్ట్ కండక్టర్ డ్యూటీ ఎక్కడ పర్మినెంట్ కాకుండా పోతుందో అన్న భయంతో  8 నెలల బిడ్డతోని రోజుకు 8గంటల డ్యూటీ చేస్తుంది ఈ తల్లి. ఒకేసారి కండక్టర్ డ్యూటీ,అమ్మ డ్యూటీ చేస్తున్న ఈమెను చూసి బస్సెక్కిన వారందరు సలాం చేస్తున్నారు..నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా…అమ్మా నీకు వందనం.