కరోనా పోవాలంటూ బస్సుకు వేప తోరణాలు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పోవాలంటూ బస్సుకు వేప తోరణాలు

March 23, 2020

Chennai

కరోనాను తరిమి కొట్టేందుకు ప్రజలు రకరకాల ఫీట్లు చేస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత ఉంటే వైరస్ ధరిచేరదని ప్రభుత్వాలు చెబుతుండటంతో ఎవరికి తోచిన విధంగా వారు శుభ్రతను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ గ్రామంలో తమ ఊరికి వచ్చే బస్సును మొత్తం వేప ఆకుల తోరణాలతో ముంచేశారు. వైరస్ రాకూడదని పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేశారు.  కోయంబత్తూరులోని గాంధీపురం గ్రామస్తులు ఇలా చేయడంతో ఈ ఫొటో వైరల్ అయింది.

ప్రతి రోజూ తమ గ్రామానికి వచ్చే ఒకే ఒక్క బస్సు కావడంతో వైరస్ రాకుండా ఉండేందుకు ఇలా ఏర్పాటు చేశారు.  ఏ పని మీద పొరుగు ఊరికి వెళ్లాలంటే ఈ బస్సునే వాడుకోవాలి. కాబట్టి ప్రతిరోజూ ప్రయాణం చేసే తమకు అనారోగ్యం కలగకుండా ఉండేందుకు స్వయంగా గ్రామస్థులే శుభ్రం చేసుకున్నారు. పసుపు నీళ్లు చల్లి, నిమ్మకాయల మాలవేశారు. బస్సు లోపలా బయట వేప తోరణాలు కట్టారు. మరోవైపు బస్సు ఎక్కే ముందు ప్రయాణికులు చేతులు, కాళ్లను, పసుపు నీళ్లతో శుభ్రం చేసుకున్న తర్వాతే ఎక్కడం విశేషం. 

వేప వళ్ల వైరస్ రాదనే నమ్మకంతో వారు ఇలా చేశామని అంటున్నారు. అమ్మ వారు వచ్చినప్పుడు, గాలి సోకినా, గ్రామాల్లో ఏదేని రుగ్మతులు సోకినప్పుడు ఏ విధంగా ఆచరిస్తారో అదే పద్దతిని ఇప్పుడు కూడా పాటించారు. కాగా ఈ గ్రామం కేరళ,తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.