డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ - MicTv.in - Telugu News
mictv telugu

డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్

September 14, 2019

Bus Driver Sleeping.

ప్రయాణికులను సురక్షితంగా చేర్చాల్సిన ఓ డ్రైవర్ వారిని ప్రమాదంలోకి నెట్టాడు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించి 40 మందిని ఆందోళనకు గురిచేశాడు. డ్రైవింగ్ చేస్తూనే నిద్రలోకి జారుకున్న ఘటన కర్నాటకలో జరిగింది. వెంటనే మరో ప్రయాణికుడు డ్రైవింగ్ సీట్ వద్దకు వచ్చి డ్రైవర్‌ను పక్కకు పడేసి బస్సును అదుపుచేశాడు. 

 బెంగుళూరు నుంచి 40 మంది ప్రయాణికులతో  గౌరిబిదనూరుకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది.  దొడ్డబళ్లాపురం దాటిన అనంతరం డ్రైవర్‌ కండోజీ నిద్రలోకి  జారుకున్నాడు. బస్సు అదుపుతప్పడంతో అందులో ఉన్నవారంతా కేకలు వేశారు.అయినా డ్రైవర్‌కు మెలుకువ రాకపోవడంతో తోటి ప్రయాణికుడే వారిని రక్షించాడు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ను సీట్‌లో పడుకోబెట్టి వాహనాన్ని బస్‌ డిపో వరకు ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి నడిపించుకెళ్లాడు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.