బస్సు లోయలో పడి ఐదుగురి దుర్మరణం - MicTv.in - Telugu News
mictv telugu

బస్సు లోయలో పడి ఐదుగురి దుర్మరణం

October 21, 2020

Bus Fell Into a Gorge in maharashtra

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మల్కాపూర్‌ నుంచి సూరత్‌కు వెళ్తున్న ఓ బస్సు ఖామ్‌చౌందర్ గ్రామ సమీపంలో లోయలో పడింది. పూణే-సోలాపూర్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. దాదాపు 35 మందికి గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌, క్లీనర్‌‌తో సహా ఐదుగురు మృతి చెందారు. ఇదే హైవేపై 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొన్ని గంటల వ్యవధిలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాలు జరిగినట్టు పోలీసులు తెలిపారు.