ఈరోజుల్లో చాలామంది యువత ఉద్యోగాలు కోసం ఎదురుచూడటం లేదు. స్వయం ఉపాధివైపు మళ్లుతున్నారు. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు..కాస్తంత తెలివి ఉపయోగిస్తే చాలు. సులభంగా సంపాదించవచ్చు.నెల నెల వచ్చే ఆదాయం సరిపోని మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు వ్యాపారరంగంలో ఓ అవకాశం గురించి చర్చిద్దాం. కోడిగుడ్ల వ్యాపారం. దీన్నిచీప్ గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నిరంతరం వచ్చే ఆదాయ వనరుగా ఉంది. కోడిగుడ్ల వ్యాపారానికి సీజన్ సంబంధం లేదు. చలికాలంలో అయితే వీటికి డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ప్రతిఏటా వీటిని డిమాండ్ భారీగా పెరుగుతుంది. అయితే ఈ కోడిగుడ్ల వ్యాపారంలో మనం చేయాల్సింది ఏంటంటే..హోల్ సేల్ డీలర్ల దగ్గర కోడిగుడ్లను కొనుగోలు చేయాలి. వాటిని కిరాణాషాపులు, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలా సప్లైచేస్తే మంచి ఆదాయం పొందవచ్చు.
కోడిగుడ్ల సప్లయ్ వ్యాపారం ఈ విధంగా ప్రారంభించండి:
దీనికి కాల్సింది ఓ గది. మినీ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ అవసరం ఉంటుంది. ఫారంలో ఒక కోడిగుడ్డ ధర రూ. 4 ఉంటే…బయట మార్కెట్లో ఒక గుడ్డు ధర రూ. 5 కు అమ్మవచ్చు. అంటే ఒక గుడ్డు మీద రూపాయి లాభం వస్తుంది. అయితే హోల్ సేలర్లు, షాపులు, డిస్ట్రిబ్యూటర్లు ఈ ఒక్క రూపాయి లాభాన్ని పంచుకోవల్సి ఉంటుంది. ఫారంలో ఒక గుడ్డు 4 రూపాయలకు కొనుగోలు చేస్తే…ఒక ట్రేకు 120రూపాయలు అవుతుంది. మార్కెట్ ధరలో ఒక ట్రే 150వరకు పలుకుతుంది. ఒకట్రే మీద మనకు 30రూపాయల లాభం వస్తుంది. వచ్చిన లాభంలో హోల్ సెలర్ వాటా 14, సప్లయర్ వాటా 6, అమ్మకందారుని వాటా 10. అంటే సప్లయర్ కు ఒక ట్రే మీద 6రూపాయల లాభం వస్తుంది. మీ ఏరియాలో 20 షాపులు ఉంటే 5 ట్రేల చొప్పున వంద ట్రేలను సప్లయ్ చేయండి. వందల ట్రేల మీద మనకు 6వందల రూపాయలు లాభం వస్తుంది. ఆ విధంగా నెలకు 18వేలు ఆదాయం పొందవచ్చు. 20షాపులకు రెండు నుంచి మూడు గంటల్లో సప్లయ్ చేస్తాం. పెద్దగా సమయం పట్టదు. ఒకవేళ మీరున్న ప్రాంతంలో హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయంటే..మరింత సప్లైను పెంచుకోవచ్చు. ఈ విధంగా చూస్తే నెలకు 50వేలు సులభంగా సంపాదించవచ్చు.