బిజినెస్ మొదలుపెట్టిన సన్నీలియోని - MicTv.in - Telugu News
mictv telugu

బిజినెస్ మొదలుపెట్టిన సన్నీలియోని

November 21, 2017

మాజీ పోర్న్ స్టారిణి, బాలీవుడ్ నటి సన్నీలియోనికి యువకుల్లో ఉన్న క్రేజీ ఎంతో మొన్నటి కొచ్చి పర్యటనలో తెలిసిందే. ఆమెను చూడ్డానికి జనం తండోపతండాలుగా ఎగబడ్డారు. సినిమాల్లోనూ, వ్యాపార ప్రకటనల్లోనూ ఆమెకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఆమె సంపాదన కూడా  భారీగా పెరిగింది. డబ్బు మూలన ఉంటే లాభం లేదు కదా. అందుకే ఆమె వ్యాపారం మొదలుపెట్టింది.సన్నీలియోని.. అర్చనా కొచ్చార్ అనే ఫ్యాషన్ డిజైనర్ తో కలసి గుడ్డల బిజినెస్ ప్రారంభించింది. ‘గుడ్ గర్ల్స్. బ్యాడ్ బాయ్స్’ పేరుతో ఆమె ఏకంగా ఒక బ్రాండునే ఓపెన్ చేసింది. ఈ దుస్తులను ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. మొదట లేట్ టీనేజీ వయసువాళ్లను టార్గెట్ చేసుకోవాలనుకున్నానని, అయితే ఇప్పుడు అన్ని వయసుల వారికీ నప్పే దుస్తులనూ కూడా అందివ్వాలని అనుకుంటున్నానని ఆమె చెప్పింది. గతంలో అనుష్క శర్మ, దీపికా పదుకొనె వంటి టాప్ కథానాయికలు కూడా ఫ్యాషన్, కాస్మెటిక్స్ వంటి వ్యాపారాలతో సక్సెస్ సాధించారు.