ఘోరం.. 11 లక్షలు దోచుకుని, కారులోనే  తగలబెట్టి..  - MicTv.in - Telugu News
mictv telugu

ఘోరం.. 11 లక్షలు దోచుకుని, కారులోనే  తగలబెట్టి.. 

October 8, 2020

Businessman Looted, Locked In Car

హరియాణాలోని హిసార్ జిల్లా, హాన్సీ ప్రాంతంలో దారుణం జరిగింది. కొందరు దొంగలు ఓ వ్యాపారిని దోచుకుని హత్యచేశారు. హన్సీలోని భట్ల-డేటా రోడ్‌లోని డేటా గ్రామంలో నివసిస్తున్న రామ్ మెహర్(35) కు రామ్ మెహర్‌కు బార్వాలాలో డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీ ఉంది. మంగళవారం రాత్రి హిసార్ వెళ్లి బ్యాంకు నుంచి రూ. 11 లక్షలు విత్ డ్రా చేసుకుని డేటా గ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో కొందరు దొంగలు అతన్ని అడ్డగించారు. దాడిచేసి అతని దగ్గరున్న మొత్తం డబ్బు దోచుకున్నారు. 

అంతటితో ఆగకుండా రామ్ మెహర్‌ను కారులో బంధించి నిప్పంటించారు. ఈ ఘటన రాత్రి వేళ జరగడంతో ఎవ్వరూ చూడలేదు. దీంతో కారుతో పాటు రామ్ మెహర్ కూడా దగ్ధమయ్యాడు. ఉదయం కాలిపోయిన కారును చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నెంబర్ ప్లేట్ ఆధారంగా బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానాలో ఆటవిక పాలన నడుస్తోందని మండిపడ్డారు.