రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా రాసిచ్చిన వ్యాపారి.. కుమారుడు, భార్యతో కలిసి.. - MicTv.in - Telugu News
mictv telugu

రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా రాసిచ్చిన వ్యాపారి.. కుమారుడు, భార్యతో కలిసి..

May 19, 2022

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బాలాఘాట్ జిల్లాకు చెందిన రాకేష్ సురానా ఓ బులియన్ వ్యాపారి. కష్టపడి సంపాదించిన తన రూ. 11 కోట్ల విలువైన ఆస్తిని గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు విరాళంగా రాసిచ్చేశారు. అనంతరం భార్య లీనా (36), కుమారుడు అమయ్ (11)తో కలిసి లౌకిక జీవితాన్ని త్యజించి, ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాకేష్ సురానా తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో జైన సమాజం రాకేశ్‌ను, ఆయన భార్యను, ఆయన కుమారుడిని రథంలో ఊరేగించారు. రాకేష్ సురానా మాట్లాడుతూ..”ఈ నెల 22న జైపూర్‌లో ముగ్గురం దీక్ష తీసుకోనున్నాం. గురుమహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నిజానికి మా కుమారుడు నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక బాట పట్టాలని నిర్ణయించుకున్నాం. కానీ, మరీ చిన్నవాడు అని ఏడేళ్లపాటు ఎదురుచూశాం. నా భార్యకు కూడా ఆధ్యాత్మిక జీవితంపై ఎంతో ఆసక్తి ఉంది” అని ఆయన అన్నారు.