Butler hitting a weird ball six
mictv telugu

వింత బంతిని సిక్స్ బాదిన బట్లర్.. ఫన్నీ వీడియో వైరల్

June 23, 2022

Butler hitting a weird ball six

కెరీర్‌లోనే బీభత్స ఫాంలో ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్.. తాజాగా నెదర్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ దుమ్ము దులుపుతున్నాడు. తొలి మ్యాచ్‌లో 162 పరుగులు చేసి రికార్డు స్కోరు సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇక బుధవారం జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ జట్టు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బరిలోకి దిగిన 30 ఓవర్లలో విజయం సాధించింది.

జేసన్ రాయ్ సెంచరీతో పాటు బట్లర్ కూడా రాణించడంతో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం దక్కించుకుంది. ఈ క్రమంలో ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. పాల్ మీక్రెన్ అనే బౌలర్ బంతిని వేయగా, అవతల బట్లర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. బంతి బట్లర్‌ను చేరేలోపు రెండు స్టెప్పులు తీసుకుంది. మొదటి స్టెప్పు పిచ్‌లోనే పడగా, రెండో స్టెప్పు బట్లర్‌కు ఎడమ వైపు పడింది. అయితే దాన్ని కూడా వదలని బట్లర్ బంతి వద్దకే వెళ్లి సిక్సు బాదాడు. అది నోబాల్ అవడంతో తర్వాతి బంతికి అంపైర్ ఫ్రీ హిట్ ఇచ్చాడు. దాన్ని కూడా సిక్సు బాదిన బట్లర్ మొత్తం 56 బంతుల్లో 86 పరుగులు చేసి విజయంలో కీలక భూమిక వహించాడు. కాగా, బట్లర్ కొట్టిన బంతి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.