కూల్ కూల్ చికెన్ ఐస్‌క్రీమ్.. చూస్తుంటేనే ఛీ... - MicTv.in - Telugu News
mictv telugu

కూల్ కూల్ చికెన్ ఐస్‌క్రీమ్.. చూస్తుంటేనే ఛీ…

September 30, 2022

లోకో భిన్న రుచిః అని ఎవరి టేస్ట్ వారిది. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలనే గ్యారంటే ఏమీ లేదు. ఎంత విభిన్నంగా, ఎంత కొత్తగా ఉంటే అంత మజా. ఢిల్లీలోని అలోఫ్ట్ ఏరోసిటీ ప్రాంతంలోని స్ట్రీట్ ఫుడ్ వ్యాపారిది అచ్చం ఇలాంటి మైండ్ సెట్టే. అందుకే దిమ్మదిరిగి కళ్లు బయటికొచ్చే వెరైటీ ఐస్ క్రీమ్ తయారు చేశాడు. ఐస్‌క్రీముల్లో వెనీలా, స్ట్రాబెరీ, పైనాపిల్, బటర్ స్కాచ్ వంటివి ఇప్పటికే ఉన్నాయని, వాటితో కస్టమర్లకు విసుగెత్తిందని కోడి హిమక్రీము తయారు చేశాడు. దీని పేరు బటర్ చికెన్ ఐస్ క్రీమ్.

 

చికెన్‌ను మెత్తంగా గ్రైండ్ చేసి, ఐస్‌క్రీముల్లో కలిపి చక్కెర, పాలు, ఫ్లేవర్స్‌తోపాటు నాన్ వెజ్ ఘాటు మసాలాలు కవగైరా కలిపేసి కూల్ కూల్‌గా అందిస్తున్నాడు. దీనికి జోడు పుదీనా చట్నీ అంట. చూడ్డానికి పచ్చగా కనిపిసిస్తున్న ఈ ఐస్‌క్రీమ్ రుచి ఎలా ఉంటుందో తెలియదుగాని జనం మాత్రం తిట్లకు లంకించుకుంటున్నారు. చూడగానే వాంతికొస్తోందని, మరీ ఇంతటి ఘోరమైన ఐడియాలు కూడా వస్తాయని అని ఆశ్చర్యపోతున్నారు. ఫుడ్‌వుడిండియా బ్లాగర్ పోస్ చేసిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది.