శుభవార్త.. రూపాయికే సానిటరీ న్యాప్‌కిన్
మహిళల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వం విక్రయిస్తున్న సానిటరీ న్యాప్కిన్‌లను కేవలం రూ.1కే అమ్మాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర రసాయన, ఎరువుల శాఖా సహాయ మంత్రి మన్‌సుఖ్ ఎల్.మాండవియా తెలిపారు.
గతంలో నాలుగు న్యాప్‌కిన్లు ఉన్న ప్యాకెట్ ధర రూ.10 గా ఉండేది. ఇకపై దానిని కేవలం రూ.4కే అందించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కేంద్రం ఆగస్టు 27 నుంచి పర్యావరణహిత శానిటరీ న్యాప్‌కిన్లను విడుదల చేస్తోంది. సువిధా బ్రాండ్‌తో ఉన్న ఈ న్యాప్‌కిన్లు దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలలో లభిస్తాయి’ అని అన్నారు. గతేడాది మార్చిలో ప్రవేశపెట్టిన సానిటరీ న్యాప్‌కిన్ల పథకం ద్వారా దాదాపు
జన్ ఔషధి స్టోర్ల నుంచి దాదాపు 2.2 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు. నాణ్యతతో కూడిన పర్యావరణహిత న్యాప్‌కిన్ల ద్వారా మహిళలకు మేలు జరుగుతుందన్నారు. తద్వారా బీజేపీ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందన్నారు.