“ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛగా మాట్లాడుకునే వారికి వేదికగా మారుతుందన్న ఉద్దేశంతో ట్విటర్లో ఇటీవలే పెట్టుబడి పెట్టా. అయితే, ప్రస్తుతం ఉన్న తరహాలో పని చేయడం వల్ల అది సాధ్యం కాదు. అందుకే ఓ ప్రైవేటు కంపెనీ తరహాలో ట్విటర్ పని చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని మార్పులు అవసరం” అని టెస్లా సీఈఓ, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌కు ఆయన భారీ ఆఫర్ ఇచ్చారు. అందుకు సంబంధించి మాస్క్ ట్విటర్‌కు ఓ లేఖ కూడా రాశారు. ఇటీవలే ట్విటర్లో ఆయన పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. ట్విటర్ కంపెనీకి చెందిన ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేసేందుకు మాస్క్ సిద్దమయ్యాడు.
ఈ విషయాన్ని ట్విటర్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం 41 బిలియన్ డాలర్లతో మిగిలిన షేర్లు కొనుగోలు చేసేందుకు మస్క్ ముందుకొచ్చారని, ఏప్రిల్ 1న ముగిసిన ట్రేడింగ్‌లో ట్విటర్ షేర్ విలువతో పోలిస్తే, 38 శాతం అధికమైయ్యాయని తెలిపింది. దీంతో మస్క్ ఇచ్చిన ఆఫర్‌తో ‘ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో ట్విటర్ షేర్లు 12 శాతం మేర దూసుకెళ్లాయి. అయితే, ఎలెన్ మాస్క్ ఇది బెస్ట్ ఆఫర్ అని, పైనల్ ఆఫర్ అని కూడా పేర్కొన్నాడు.
ఒకవేళ తన ఆఫర్‌ను ఆమోదించకపోతే వాటా విషయంలో పునరాలోచన చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ట్విటర్లో మస్క్ 9.2 శాతం వాటా కొనుగోలుతో అతి పెద్ద వాటాదారుగా మారారు. ఈ నేపథ్యంలో ట్విటర్ బోర్డులోకి ఆహ్వానించగా.. చివరి నిమిషయంలో మనసు మార్చుకుని బోర్డులో చేరేందుకు నిరాకరించారు.ఇప్పుడు ఏకంగా సంస్థను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు.
మరోపక్క ఏదేనీ కంపెనీకి ఓపెన్ ఆఫర్ ఇవ్వాలంటే, ఆ కంపెనీలో 25 శాతం షేర్లు కలిగి ఉండాలి. మరి ట్విట్టర్లో కేవలం 9.1 శాతం షేర్లతోనే మస్క్ ఓపెన్ ఆఫర్‌కు దిగుతున్నారంటే.. అతి త్వరలోనే 25 శాతం వాటా దక్కించుకునేందుకు కూడా ఆయన వెనుకాడరన్న వాదనలు వినిపిస్తున్నాయి.