గురువుతో కాళ్లు మొక్కించుకుని, సారీ చెప్పించుకుని.. - MicTv.in - Telugu News
mictv telugu

గురువుతో కాళ్లు మొక్కించుకుని, సారీ చెప్పించుకుని..

September 27, 2018

గురుబ్రహ్మ, గురుర్విష్ణు:, గురుదేవో మహేశ్వర: గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ:  అంటూ గురువునi త్రిమూర్తులతో పోల్చి గౌరవిస్తాం. తల్లిదండ్రుల తర్వాత ఉన్నతమైన స్థానం గురువుదే. . కానీ మధ్యప్రదేశ్‌లో ఓ విద్యార్థి సంఘం కార్యకర్తలు  దైవంతో సమానమైన గురువుతోనే కాళ్లు మొక్కించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

https://youtu.be/xXhVfboLr1U

మందసౌర్‌లో ఏబీవీపీకి చెందిన విద్యార్థులు నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యం కావడంపై భగ్గుమన్నారు. వాటిని త్వరగా వెల్లడించాలని డిమాండ్ చేస్తూ  రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. తరగతి గది వద్ద నిల్చుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో ప్రొఫెసర్ దినేశ్‌గుప్తా వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పాడు. విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారని,  నినాదాలు చేయొద్దని కోరారు. దీంతో మరింత రగిలిపోయిన విద్యార్థి సంఘం నాయకులు ప్రొఫెసర్‌ దేశద్రోహి అని తిడుతూ నినాదాలు చేశారు. తమకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే దేశద్రోహం కింద కేసు పెడతామని బెదిరించారు. దీంతో భయపడిన ప్రొఫెసర్ సదరు విద్యార్థుల కాళ్లు మొక్కుతూ క్షమాపణలు చెప్పారు. అప్పుడుగాని వారు ఆయణ్ణి వదిల్లేదు..

‘నన్ను దేశవ్యతిరేకిగా చిత్రీకరించాలని ఏబీవీపీ విద్యార్థులు ప్రయత్నించారు. అందుకే నేను వారి కాళ్లపై పడి క్షమాపణలు కోరాను. నేను ఎప్పుడు విద్యార్థులు బాగా చదువుకుని వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాలనే కోరుకుంటాను’ అని అన్నారు.

https://youtu.be/xXhVfboLr1U