Home > Featured > ప్రపంచ దిగ్గజాన్ని మట్టికరిపించిన ప్రణయ్

ప్రపంచ దిగ్గజాన్ని మట్టికరిపించిన ప్రణయ్

BWF World Championships 2019

స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ సంచలన విజయం సాధించాడు. చైనాకు చెందిన దిగ్గజ షట్లర్, ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్‌ లిన్ డాన్‌ని మంగళవారం చిత్తుగా ఓడించాడు.

పురుషుల సింగిల్స్‌లో భాగంగా ఈరోజు జరిగిన రెండో రౌండ్‌లో ప్రణయ్ 21-11, 13-21, 21-7 తేడాతో గెలిచి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. తొలి సెట్‌లోనే సత్తా చాటిన ప్రణయ్ 21-11 తేడాతో లిన్‌డాన్‌కి ఊహించని షాకిచ్చాడు. అయితే..రెండో రౌండ్‌లో పుంజుకున్న లిన్‌డాన్ తన అనుభవాన్ని వినియోగించి సెట్‌ని దక్కించుకున్నాడు. దీంతో నిర్ణయాత్మక మూడో సెట్‌పై ఉత్కంఠ నెలకొంది. మూడో సెట్‌లో దూకుడు పెంచిన ప్రణయ్.. ఆఖరి వరకూ లిన్‌డాన్‌కి పుంజుకునే అవకాశమివ్వలేదు.

Updated : 20 Aug 2019 7:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top