Home > Featured > ఉప ఎన్నికలు : యూపీలో రెండు ఎంపీ సీట్లను గెలిచిన బీజేపీ

ఉప ఎన్నికలు : యూపీలో రెండు ఎంపీ సీట్లను గెలిచిన బీజేపీ

దేశంలో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. అందరి దృష్టిని ఆకర్షించిన యూపీలోని రెండు లోక్ సభ స్థానాలు ఆజం ఘడ్, రాంపూర్‌లను అధికార బీజేపీ దక్కించుకుంది. సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ రెండు స్థానాలు బీజేపీ గెలవడంతో మఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. మరో లోక్ సభ స్థానం సంగ్రూర్‌ను శిరోమణి అకాళీదళ్ దక్కించుకుంది. అక్కడ గత రెండు ఎన్నికల్లో పంజాబ్ సీఎం భగవంత మాన్ గెలవడం విశేషం. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే.. ఏపీలో వైసీపీ, జార్ఖండ్‌లో కాంగ్రెస్, ఢిల్లీలో ఆప్, త్రిపురలో 4 స్థానాలకు గానూ బీజేపీ 3, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి.

Updated : 26 Jun 2022 6:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top