బ్యాంక్ రాబర్ బొమ్మతో మోదీకి వినూత్న నిరసన - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంక్ రాబర్ బొమ్మతో మోదీకి వినూత్న నిరసన

July 2, 2022

హైదరాబాద్ నగరానికి నేడు ప్రధాని మోదీ రానున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ప్రధాని రాకని స్వాగతిస్తూ.. బీజేపీ నేతలు, కార్యకర్తలు కాషాయ జెండాలను, బ్యానర్లను ఏర్పాటు చేశారు. మరోవైపు మోదీ రాకను వ్యతిరేకిస్తూ.. ఆయన వ్యతిరేకంగా పలు చోట్ల ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అని ఫ్లెక్సీలు వెలిసిన సంగతి తెలిసిందే. నేడు మరింత వినూత్నంగా ప్రధానికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వనస్థలిపురంలోని పెట్రోల్ బంక్, బ్యాంకుల ముందు వినూత్నంగా ఒక దోపిడీ దొంగ వేషంలో ఒక వ్యక్తి ప్లకార్డుతో దర్శనమిస్తున్నారు. ఆ ప్లకార్డులో ‘మేము బ్యాంకులను మాత్రమే దోచుకుంటే.. నువ్వు ఏకంగా దేశాన్నే దోచేశావు… బై బై మోదీ’ అని రాసి ఉంది. వీటిని జనం చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు.