6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. పోలింగ్‌ ప్రారంభం.. - MicTv.in - Telugu News
mictv telugu

6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. పోలింగ్‌ ప్రారంభం..

November 3, 2022

Bypolls on 7 Assembly seats in 6 states started today at 7am

నేడు మునుగోడుతో పాటు దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు బై పోల్స్ పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, ఒడిశాలోని ధామ్ నగర్, మహారాష్ట్రలోని అంధేరి (ఈస్ట్), హర్యానాలోని అదమ్‌పూర్, తెలంగాణలోని మునుగోడు, యూపీలోని గోల గోకర్‌నాథ్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈనేపథ్యంలో ఆయా స్థానాల్లో పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అంధేరీ ఈస్ట్, గోలా గోక్రా నాథ్, ధామ్ నగర్ ఎమ్మెల్యేలు మృతిచెందడంతో ఆ మూడు స్థానాలకు బైపోల్ అనివార్యమైంది. ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కారణంగా ఉప ఎన్నిక  వచ్చింది. గత నెలలో ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవగా.. ఇవాళ ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 6న ఓట్లను లెక్కించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.