బాబాయ్ అనుచరులపై బైరెడ్డి సిద్ధార్థ అనుచరుల దాడి
కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ జడలు విప్పింది. వైసీపీ, బీజేపీ నేతల అనుచర వర్గాలు పర్సపరం దాడ చేసుకున్నాయి. బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అనుచరులపై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు దాడి చేశారు. పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాబాయ్, అబ్బాయి వర్గాల మధ్య వర్గపోరు రాజు కోవడంతో జిల్లాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఓ ఎస్సై కూడా గాయపడ్డాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు జిల్లాలో భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు బలగాలను మోహరించారు.
కర్నూలు జిల్లా ఇరు వర్గాలకు చెందిన వారు కర్రలు, రాళ్లతో చితక్కొట్టుకున్నారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో తోపాటు ఏఎస్సైకి గాయాలయ్యాయి.
ముచ్చుమర్రి ఎంపీటీసీ నామినేషన్ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగినట్టుగా అధికారులు భావిస్తున్నారు. బీజేపీ తరుపున అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజశేఖర్ రెడ్డి అనుచరుడిపై కొంత మంది ప్రత్యర్థులు దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి అనుచరులు ఇద్దరికి గాయాలు కాగా, సిద్ధార్ధరెడ్డి అనుచరుడు ఒకరు గాయపడ్డారు. అయితే ప్రత్యర్థులు తమ ఇంటిపైకి గుంపులుగా వచ్చి దాడికి దిగారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా స్థానిక ఎన్నికల నామినేషన్ మొదలైనప్పటి నుంచి బాబాయ్, అబ్బాయ్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.