ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల శ్రీకాకుళంలో యువశక్తి పేరుతో నిర్వహించిన సభలో.. వైసీపీ నేతలపై వరుస పంచ్‌లు వేశారు జనసేన నాయకులు. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిని స్టేజిపైకి పిలిపించి వైసీపీ మంత్రులని తిట్టించిన వైనం పెద్ద ఎత్తున వైరల్ అయింది. దాంతో ఆది పంచులకి వైసీపీ కౌంటర్లు స్టార్ట్ చేసింది. రోజా ఇప్పటికే ఆది వ్యాఖ్యలని లైట్ తీసుకోవాలని అంటే.. ఏపీ పొలిటికల్ యాంగ్రీ యాంగ్ మెన్ బైరెడ్డి మాత్రం నిప్పులు చెరిగారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హైపర్ ఆదికి అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అయితే ఆదిని వైసీపీ సెంటర్ చేస్తుంటే ఇప్పటి వరకు జనసేన నుండి ఒక్కరు కూడా మద్దతుగా నిలవలేదు. ఆది ఇప్పుడు ఒంటరి అయ్యాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక రణస్థలం సభలో హైపర్ ఆది అడిగిన ప్రశ్నకు సిద్ధార్థ్ రెడ్డి స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్, నాగబాబులను గొప్పగా చూపించడానికి హైపర్ ఆది అనే కమెడియన్ ని వాడుకున్నారని బైరెడ్డి అన్నారు. ఇక ఆది పంచ్‌లపై ఇప్పటికే ఫేస్బుక్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆర్మీ పేరుతో సెటైర్లు పేలుతున్నాయి. హైపర్ ఆదిగాడికి డైపర్ వేయాల్సిన టైమ్ వచ్చిందంటూ సాగుతున్న ఈ సెటైర్లలో ఆది ఫోన్ నెంబర్ అంటూ ఒక నెంబర్ కూడా ఇచ్చి ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో మాటల దాడిని కూడా YCP తీవ్రతరం చేసింది. ఆది కాదు ఏకంగా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు. రంగం సినిమాలో విలన్ మాదిరి పవన్ కళ్యాణ్ తయారయ్యాడని సెటైర్స్ వేస్తున్నారు. బయటికి ఉద్యమం చేయాలంటూ ఆ చిత్రంలోని విలన్ లోపల తీవ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నట్టు.. పవన్ బయట మంచివాడిలా నటిస్తూ.. చంద్రబాబు వంటి దుర్మార్గుడికి మద్దత్తు ఇస్తున్నట్టు బైరెడ్డి వ్యాఖ్యానించాడు. పవన్-చంద్రబాబు ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు.