తెలంగాణ సింగిడి సినారె... - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ సింగిడి సినారె…

June 15, 2017

జనం మాట ఆయన పాట..ఆయన ధ్యాస తెలంగాణ యాస. ఆయన ప్రతి పదంలో పల్లెదనం.అందుకే ఎప్పుడు సినారె పాటలు విన్నా మైమరిచిపోవాల్సిందే…

‘‘మక్కజొన్నతోటలో ముసిరిన సీకట్లలో’’…‘‘ఓ ముత్యాల కొమ్మా’’…‘‘దంచవే మేనత్త కూతరా ఒడ్లు దంచవే  నాగుండెలదరా…. దంచు దంచు బాగా చందు’’ ఈ పాటలు జనాల్లోకి ఎంతగా వెళ్లావో చెప్పానవసరం లేదు. ఆల్ టైం గ్రేట్ సాంగ్స్. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనే అనిపిస్తుంది.

తెలంగాణ ఏరియా నుంచోచ్చిన మలి తరం కవి సింగిరెడ్డి నారాయణరెడ్డి.  సినారేగా అంతా పిల్చుకునే ప్రపంచ పదుల విశ్వంభరుడు…..  తెలుగు సాహిత్యం మీద చెదిరే ముద్దరేసిండు…. దాంట్ల తెలంగాణ జీవితాన్ని సింగిడేసి సూపిండు. ఈయన రాసినా చానా పాటలు… అరే  ఇవి  నారాయణరెడ్డి రాసిండా… బాగుంది…. అని అనుకునేటోళ్లో ఎంత మందున్నరో లెక్కనే లేదు. నన్ను దోచుకుందువ‌టే.. అని ఆయ‌న రాసిన తొలిపాటే సూప‌ర్‌హిట్‌.అక్కడ నుంచి మొదలైన పాటలరాత జైత్రయాత్ర చనిపోయే దాకా కొనసాగింది. అరుంధ‌తి సినిమాలో జేజ‌మ్మ ఆయ‌న రాసిన చివ‌రి పాట‌.

తెలంగాణ జనాలకు అందనంత దూరంల ఉన్న తెలుగు సిన్మాల తెలంగాణ  బతుకును సూపెట్టిండు. ‘‘మక్కజొన్నతోటలో ముసిరిన సీకట్లలో’’అనే పాట తెలుగు సిన్మ ప్రపంచంలో మస్తు ఫేమస్. ఇదింటే పాడిన గొంతును వట్టి పక్కా ఆంధ్రా నుంచే వచ్చిందని అనుకుంటరు. కని ఈ పాటల జెప్పిన మక్క జొన్న సేను పక్కా తెలంగాణదే. మక్కజొన్న సేన్లు మస్తుగ సాగు జేసెది తెలంగాణల్ననే. అంతే గాదు….1971ల వచ్చిన  జీవిత చక్రం సీన్మల బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…. పల్లవితో పాట స్టార్ట్ అవుతుంది. మనం ఈ నడ్మనే ఈ పాటలు ఎక్వ పాడుకుంటున్నం… ఇంటున్నం….ఆయన అప్పట్లనే పాట రాసిండు.

మత్తు వదలరా.. నిద్దుర మత్తు వదలరా.. అనగనగా ఒక రాజు.. అనగనగా ఒకరాణి పాటలు ఎంతో అద్భుతం.

బాలకృష్ణ సీన్మ మంగమ్మగారి మనువడులో ‘‘దంచవే మేనత్త కూతరా ఒడ్లు దంచవే  నాగుండెలదరా…. దంచు దంచు బాగా చందు’’ పాటల కూడా రోలు, రోకలి. లంగా వోణి  ఇవన్నీ తన చిన్నతనంలో తన ఊరిలో చూసిన వాటినే ప్రతీకలుగా తీసుకుని రాసినవి. ఓసే రాములమ్మ సిన్మల….ఓ ముత్యాల కొమ్మా…  పాట సాంతం హన్మాజీ పేట వాగు నురగలు… ఉస్కె తిన్నెలను యాద్జేసుకుంట రాసిందే. ఇట్లా సెప్సుకుంట పోతే మస్తుగ పాటలున్నవి.  తెలుగు సిన్మ మీద తెలంగాణ సాహిత్య సింగిడి సినారే.ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన పాటలు జనంలో ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటాయి. జోహార్ సినారె…