25 ఏళ్లకే రూ. 50 కోట్ల మోసం.. గుజరాత్‌లో వెలుగులోకి - MicTv.in - Telugu News
mictv telugu

25 ఏళ్లకే రూ. 50 కోట్ల మోసం.. గుజరాత్‌లో వెలుగులోకి

October 24, 2020

CA Student Held For Rs 50 crore GST Fraud  .jp

జీఎస్టీ అధికారులనే 25 ఏళ్ల కుర్రాడు బురిడీ కొట్టించాడు. ఫేక్ కంపెనీని సృష్టించి ఏకంగా రూ. 50.2 కోట్ల పన్నులను ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వడోదరలోని సీఏ విద్యార్థి చేసిన ఈ పనితో అంతా అవాక్కయ్యారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వానికి డబ్బు ఎగ్గొట్టాలనే పన్నాగంతో ఇలా తప్పుదారి పట్టించాడని అధికారులు తెలిపారు. 

మనీష్‌ కుమార్‌ ఖత్రీ తన తెలివిని ఉపయోగించి జీఎస్టీని ఎగ్గొట్టాడు.  115 షల్‌ కంపెనీలు సృష్టించి వాటి నుంచి చెల్లించాల్సిన మొత్తాన్ని పక్కదారి పట్టించాడు.  పన్నులు  కట్టే వారి వివరాలను సేకరించే క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆరా తీయగా..ఖత్రీ నకిలీ ఇన్‌వాయిస్‌లు సృ‍ష్టించి పన్నులు ఎగ్గొట్టాడని తేలింది. దీని కోసం దాహుద్‌ అనే చిన్న గ్రామంలో ఉన్న అమాయకులను ఆసరగా చేసుకున్నాడు. వారితో  బ్యాంక్‌ ఖాతా తెరిచి ఫేక్ కంపెనీలను సృష్టించాడు. దీనికి వారికి ప్రతి నెల ఎంతో కొంత ఇచ్చేవాడు.మరికొన్ని కంపెనీలకు పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం అందించేందుకు నకిలీ వెబ్ సైట్లతో కంపెనీలు కూడా సృష్టించాడని తేల్చారు.