సీఏఏ ఎందుకో అర్థం కావడంలేదు - MicTv.in - Telugu News
mictv telugu

సీఏఏ ఎందుకో అర్థం కావడంలేదు

January 19, 2020

PM Sheikh Hasina.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాన్ని భారత ప్రభుత్వం ఎందుకు తెచ్చిందో తనకు అర్థం కావడంలేదని ఆమె అన్నారు. ఆ చట్టం అవసరంలేదని తెలిపారు. ఇది భారత దేశ అంతర్గత వ్యవహారమని అన్నారు. 

దుబాయ్‌లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సీఏఏ, ఎన్ఆర్‌సీ అనేవి భారత దేశ అంతర్గత వ్యవహారాలు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్ఆర్‌సీ కేవలం భారతదేశ అంతర్గత వ్యవహారమని నాకు చెప్పారు. 2019 అక్టోబరులో నేను ఢిల్లీకి వెళ్లినపుడు నాకు మోదీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. భారత్‌, బంగ్లాదేశ్‌ సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. మతపరమైన పీడనతో బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు ఎవరూ వలస పోలేదు’ అని హసీనా తెలిపారు. 

కాగా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు భారత ప్రభుత్వం సీఏఏను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కేరళ, పంజాబ్ రాష్ట్రాలు సీఏఏను అమలు చేయబోమని ప్రకటించాయి.