సీఏఏ ఎందుకు? బంగ్లాలో హిందువులపై వేధింపులే లేవే.. హసీనా - MicTv.in - Telugu News
mictv telugu

సీఏఏ ఎందుకు? బంగ్లాలో హిందువులపై వేధింపులే లేవే.. హసీనా

January 20, 2020

nmj

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతోన్న సంగతి తెల్సిందే. ఈ సమయంలో పౌరసత్వ సవరణ చట్టంపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ‘గల్ఫ్ న్యూస్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె సీఏఏ పై స్పందించారు. హసీనా మాట్లాడుతూ..’బంగ్లాదేశ్ జనాభా16 కోట్లుకాగా, అందులో 10.7 శాతం మంది హిందువులే ఉన్నారు. వాళ్లంతా సురక్షితంగా ఉన్నారు. వారిపై మతపరంగా ఎలాంటి వేధింపులు జరగడంలేదు. అయినా భారత ప్రభుత్వం ఎందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చిందో తమకు అర్థం కావట్లేదు.’ అని అన్నారు. 

సీఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నామంటూ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఆమె పరోక్షంగా సమర్థించారు. సీఏఏ భారతదేశ అంతర్గత వ్యవహారం కాబట్టి దీనిపై ఎలాంటి జోక్యం ఉండబోదని షేక్ హసీనా స్పష్టత ఇచ్చారు. సీఏఏ, ఎన్సార్సీ అనేవి భారత దేశ అంతర్గత వ్యవహారాలని తాము మొదటి నుంచీ చెబుతున్నామన్నారు. గతేడాది భారత పర్యటన సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని నాతో చెప్పారు. ఈ చట్టాలతో బంగ్లాకు ఎలాంటి ఇబ్బందులుండవని హామీ ఇచ్చారని హసీనా తెలిపారు.