పెళ్లి కార్డులో వధూవరుల పేర్లతో పాటు అది కూడా.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కార్డులో వధూవరుల పేర్లతో పాటు అది కూడా..

January 18, 2020

 

jjnhgkb

పెళ్లి కార్డు అంటే వధూవరుల పేర్లు, మంత్రోచ్ఛరణలు, ముహూర్త సమయం రాసి బంధువులను ఆహ్వానిస్తారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి పత్రికలను విచిత్రంగా ముద్రించాడు. కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ఇస్తున్నట్టు పేర్కొంటూ అందులో ముద్రించాడు. వధూవరుల పేర్లతో పాటు దీన్ని కూడా పెద్ద అక్షరాలతో ముద్రించి అందరికి ఇస్తూ.. దీనిపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

నరసింహపూర్ జిల్లాకు చెందిన  ప్రభాత్‌కు ఇటీవల వివాహం నిశ్చయం అయింది. దీనికి బంధు మిత్రులను ఆహ్వానించేందుకు పెళ్లి కార్డులు ముద్రించారు. ఇతడు సీఏఏ మద్దతుదారుడు కావడంతో దాంట్లో  పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ఇస్తూ అందులో ముద్రించాడు. తాను దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కలిగించాలని ఇలా చేస్తున్నట్టు తెలిపాడు. కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు సీఏఏ మద్దతుదారులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంక్రాంతి సందర్భంగా సీఏఏ నినాదంతో కూడిన పతంగులను ఎగురవేశారు. మహిళలు ముగ్గులు వేసి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.