అసెంబ్లీ ముట్టడికి క్యాబ్ డ్రైవర్ల ప్రయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

అసెంబ్లీ ముట్టడికి క్యాబ్ డ్రైవర్ల ప్రయత్నం

November 2, 2017

ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు గురువారం  అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీనితో  పోలీసులు వారిని అరెస్టు చేశారు. ’ఓలా, ఊబర్ సంస్థల వల్ల, మేము రోడ్డున పడ్డామని‘, వెంటనే మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, అందరూ  నిరసన వ్యక్తం చేశారు.

రోడ్లపై కార్లను నిలిపి  ముట్టడికి యత్నించారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల చుట్టూ ట్రాఫిక్ స్థంభించగా, ప్రజలకు ఇబ్బంది ఏర్పడింది. క్యాబ్ డ్రైవర్ల  కార్లను క్రేన్ల ద్వారా పోలీసులు పోలీసు‌స్టేషన్’కు తరలించారు.