తెలుగు వారికి ఉత్త చేయి - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు వారికి ఉత్త చేయి

September 3, 2017

తెలుగు వారి గురించి  బిజెపి పెద్దలు అస్సలు పట్టించుకున్నట్లు లేరు.  తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏక్ నిరంజన్ దత్తన్నను పక్కకు తప్పించారు. దాని కంటే  ముందే వెంకయ్యను  సీరియస్ పాలిటిక్స్ నుండి బయటక  పంపించారు. సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి క్రీయాశీలక రాజకీయాలో మనకు ప్లేస్ లేకుండా చేశారు. అయితే దీనికి బిజెపి మరేదైనా ఎజెండా ఇప్లీమెంట్ చేయాలని అనకుంటున్నదా అనేది చూడాలి.

అయితే మంత్రి వర్గ విస్తరణలో తెలుగు వారికి స్థానం ఉంటుందని పెద్ద ఎత్తున ఊహానాలు వచ్చాయి. ఎపి నుండి హరిబాబు, రామ్  మావధవ్ లకు ఛాన్స్ ఉంటుందని అనుకున్నారు. హరి బాబు  ఢిల్లీ వెళ్లారు. అయినా ఎందుకో ఆయన విషయంలో ఏం జరిగిందో తెలియడం లేదు. ఇక తెలంగాణ  నుండి వెదిరికే ఛాన్స్ ఇస్తారని అనుకున్నారు. ఇవన్నీ బిజెపి నాయకులు కావాలనే ఇచ్చిన లీకులో లేక పోతే అట్లా ప్రచారం జరిగాయో  తెలియదు.

చివరకి చూస్తే తెలుగు వారికి ఉత్త చేయి చూపించారు మోడీ.  సౌత్ ఇండియా నుండి కర్నాటకకు మాత్రం ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడ పార్టీ  కాస్త బలంగా ఉంది కాబట్టి  ఈ నిర్ణయం తీసుకున్నారు కావొచ్చు. తాను మంత్రి వర్గంలోకి తీసుకున్న అధికారులు కూడా చాలా మటుకు పై  రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు.  ఇదంతా ఎన్నికలను  దృష్టి పెట్టుకుని చేసినవే అయినా మరీ   మన వారిని పట్టించుకోక పోవడం మాత్ర వరీ దారుణ మనే  ప్రచారం జరుగుతున్నది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరి నాయకుల పేర్లు బలంగా తెరపైకి రావడంతో  మన ప్రాంతానికి కూడా  ప్రాధాన్యత ఇస్తున్నారని అనుకున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు మోడీ. ఉత్తరాదికి చెందిన వారో సారి పెద్ద వేసినట్లైంది. అయితే  సుష్మస్వరాజ్, ఉమభారతీల వార్నింగ్ లకు దడుసుకుని మోడీ వారిని కదిలించ లేక పోయారనే విమర్శలున్నాయి. దత్తాత్రేయ విషయంలో మోడీ చాలా ఈజీగా  నిర్ణయం తీసుకున్నారు. బిసి సామాజిక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయనను తప్పించడం వల్ల ఇక్కడ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా అయింది.

ముందు ముందు  ఆయనకూ రాజ్యంగ బద్దమైన పదవులిస్తారనే  ప్రచారం జరుగుతున్నప్పటికీ  రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి నాయకులు మాత్రం  ఆవేదనలో ఉన్నారు. ఈ సారి  మంత్రి వర్గంలోకి కొత్త వారికి ఛాన్స్ ఉంటుందని అనుకున్నారు. పార్టీనీ విస్తరించాలని అనుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు  కాస్త ప్లాన్  గానే మిగిలి పోయేలా ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాదికి ప్లాన్ సిద్దం చేసుకున్నారు. దక్షిణాదిని వదిలేసినట్లుంది. అంతే కాదు ఇక్కడ టిఆర్ఎస్ ను  కాదని బిజెపి ఏమీ చేయలేదనే విషయం కూడా బిజెపి పెద్దలకు అర్థం అయినట్లుంది. అందుకే ఇక్కడ వేలు  పెట్టకూడదని అనుకునే దత్తన్నను కదిలించినట్లు తెలుస్తున్నది.

ఏదేమైనా బిజెపి  తీసుకున్న  ఈ నిర్ణయం  రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేతల పని తీరుపై ప్రభావం చూపించేలా ఉంది. అంతే కాదు  ఇక్కడ బిజెపి బలపడేందుకు కూడా పెద్దగా అవకాశాలు లేవు. లెఫ్ట్  ఉద్యమాలు, బలమైన ప్రాంతీయపార్టీలున్నాయి. కులం బలంగా ఉంది. స్థానిక  అగ్రకులాలను కాదని ఉత్తరాది బ్రాహ్మణాదిపత్య పార్టీ ఇక్కడ బత్కడమూ కష్టమనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే  వెంకయ్యను, దత్తన్నను సీరియస్ పాలిటిక్స్ నుండి తప్పించి ఈ స్థానాలను ఉత్తరాది వారితో భర్తీ చేయించారు.