కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 140 మందికి పైగా మృతి - MicTv.in - Telugu News
mictv telugu

కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 140 మందికి పైగా మృతి

October 31, 2022

Cable bridge collapse: More than 140 killed in Gujarat

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని మోర్భీ పట్టణంలోగల తీగల వంతెన(కేబుల్ బ్రిడ్జి) కుప్పకూలిన ఘటనలో 140 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఆదివారం సాయంత్ర మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన కూలిపోవడంతో ఒక్కసారిగా 500 మంది వరకు సందర్శకులు నదిలో పడిపోయారు.  ఈత వచ్చిన వారు ఈదుకుంటూ ఒడ్డుకు రాగా.. పిల్లలు, పెద్దలు, మహిళలు నదిలోనే  పెద్ద నదిలో పడిపోయారు. బ్రిటీష్‌ కాలం నాటి వంతెనను రిపేర్ల తరువాత ఐదు రోజుల క్రితమే రీ ఓపెన్‌ చేశారు. కెపాసిటీకి మించి జనం వంతెన పైకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

కొత్తగా పునర్ నిర్మించిన కేబుల్ బ్రిడ్జీని తమ అనుమతి లేకుండానే తెరిచారని మోర్బీ మున్సిపల్ చీఫ్ ఆఫీసర్ సందీప్ సింగ్ ఝూలా చెప్పారు మచ్చు నదిలో పడిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని గుజరాత్ పోలీసులు చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంతో పాటు ఎన్డీఆర్ఎఫ్,ఆర్మీ,ఎయిర్ ఫోర్స్, నావికా బృందాలను  సహాయ చర్యల కోసం మోర్బీ వంతెన వద్ద రంగంలోకి దించారు.

 

అయితే ఈ ఘటనకు గుజరాత్‌ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి బ్రిజేశ్‌ మీర్జా వెల్లడించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వం అన్ని విధాలా అదుకుంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించినట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.