జూనియర్ ఎన్టీఆర్,రణబీర్ కు  కాగ్ నోటీసులు ...! - MicTv.in - Telugu News
mictv telugu

జూనియర్ ఎన్టీఆర్,రణబీర్ కు  కాగ్ నోటీసులు …!

August 5, 2017

పెద్ద హీరోలు ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునేషన్ తీస్కుంటారు,మరి తీసుకున్న రెమ్యునేషన్ లో ప్రభుత్వానికి  కట్టవలసిన పన్ను సక్రమంగా కడుతున్నారా?ఏమో మరి తాజాగా జూనియర్ ఎన్టీఆర్,రణబీర్ కపూర్  ఇద్దరు కాగ్ నుంచి పన్ను మినహాయింపుపై  నోటీసులు అందుకున్నారు.జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా అప్పుడు అనుచిత రీతీలో పన్ను మినహాయింపు పొందాడట,ఆ సినిమాకి దాదాపు 7 కోట్లకు మీదనే రెమ్యూనేషన్ తీస్కుంటే…లెక్క ప్రకారం 1కోటీ పదిలక్షలు ప్రభుత్వానికి  కట్టాల్సి ఉండగ.. ఎక్స్‌పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద తారక్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది. సినిమాలో ఎక్కువగా భాగం లండన్ లో షూట్ చేయటంతో సేవలు ఎగుమతి చేస్తున్నామన్న కారణం చూపి 1.10 కోట్ల ట్యాక్స్ మినహాయింపు పొందారట. అలాగే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా ఆయే దిల్ హై ముష్కిల్ సినిమా విషయంలో ఈ తరహా మినహాయింపు పొందటంతో అతనికి కూడా నోటీసులు ఇచ్చింది కాగ్.

వీరికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని కాగ్ భావించింది. దీంతో ఇద్దరు నటులకు షోకాజ్ కం డిమాండ్ నోటీసులు ఇవ్వటంతో పాటు అలాంటి అవకతవకలు ఇంకా ఉన్నాయా పరిశీలించమని సంబంధిత అధికారులను చెప్పారట.