రైళ్లల్లో ఆ ఫుడ్ తిన్నారో..అంతే..! - MicTv.in - Telugu News
mictv telugu

రైళ్లల్లో ఆ ఫుడ్ తిన్నారో..అంతే..!

July 21, 2017

రైళ్లల్లో శుచి, రుచికరమైన ఆహారాన్ని అందిస్తామన్న సర్కార్.. చేతల్లో జీరో..అదే పనికిరాని , పాచిపోయిన ఫుడ్ ను అందిస్తోంది. మిల మిల మెరిసిపోయే మినరల్ వాటర్ అందిస్తామన్నారు. కానీ పేరు ఊరు లేని డకోట వాటర్ బ్యాటిల్స్ లో ట్యాప్ నీళ్లు నింపి అమ్ముతున్నారు. టోటల్ గా టేస్టీ లెస్ ఫుడ్ తో వ్యాక్ అనిపిస్తోంది భారతీయ రైల్వే. ఇవీ మేము అంటున్న మాటలు కాదు… రైళ్లల్లో ఆహారం పనికిరాదని కాగ్ తేల్చింది. ఇంకా ఏం చెప్పిదంటే…

రైళ్లల్లో ప్రజలకు అందిస్తున్న ఆహారం మనుషులు తినడానికి పనికిరాదని కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) స్పష్టం చేసింది. పాడైపోయిన ఆహారం, రీ-సైక్లిడ్‌ ఫుడ్‌, ప్యాక్లెట్లలో ఉంచిన ఆహారం, గుర్తింపు లేని కంపెనీల వాటర్‌ బాటిల్స్‌ను ప్రయాణికులకు రైల్వే అందిస్తోందని రిపోర్టులో పేర్కొంది.

 

రైల్వే ఆహారపు పాలసీని తరచూ మారుస్తూ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. కాగ్‌, భారతీయ రైల్వేకు చెందిన అధికారులు సంయుక్తంగా 74 స్టేషన్లు, 80 రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. తాము నిర్వహించిన తనిఖీల్లో ఆహారం తయారుచేసే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించడం లేదని తెలిసిందని కాగ్‌ చెప్పింది. ఇలాంటి ఆహారం కొన్న ప్రయాణికులు బిల్లులు కూడా ఇవ్వడం లేదని పేర్కొంది.

ట్యాప్‌ల నుంచి నీటిని పట్టి అమ్మేస్తున్నారని రిపోర్టులో పొందుపరిచింది. బెవరేజెస్‌, చెత్త కుండీలకు మూతలు ఉండటం లేదని చెప్పింది.

కాగ్ రిపోర్ట్ చూస్తే రైళ్లో ఫుడ్ తినకముందే కడుపులో వికారమవుతున్నట్టు ఉంది కదా…సో ట్రైన్ జర్నీ చేయబోతున్నప్పుడు ఆరోజుకు సరిపోను ఫుడ్ ను , వాటర్ ను ఇంటి నుంచి పట్టుకోండి..లేదంటే రైల్వే చెత్త తిండికి బుక్కవ్వాల్సిందే.