ఎముకలు లేని శరీరాన్ని ఊహించలేం. శరీరం నిర్మాణం మొత్తం ఎముకలపైనే ఆధారపడి ఉంటుంది. అవే లేకపోతే శరీరం ముద్దలా మారి కుప్పకూలుతుంది. మనం తేలికగా కదలటానికి, చురుకుగా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం. అవి బలంగా లేకపోతే ఇట్టే విరిగిపోతాయి లేకపోతే అరిగిపోతాయి. కాబట్టి మనం మన ఎముకల మీద కూడా తగినంత శ్రద్ధ పెట్టాలి.అవి బలంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలి.
కొంతమందికి చిన్నవయసులోనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో కాల్షియం లేకపోవడం. ఆహారంలో తగినంత క్యాల్షియం లేకపోయినా, శరీరం క్యాల్షియంను గ్రహించలేకపోయినా ఎముకలు బలహీనమవుతాయి. ఎముకల ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి.. రోజుకు కనీసం 1000 mg కాల్షియం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన టాబ్లెట్లు వేసుకోవచ్చును కానీ చిన్నతనం నుంచే వీటికి అలవాటు పడడం అంత మంచిది కాదు. కొంత పెద్దయ్యాక ఎలాగూ సప్లిమెంట్స్ తప్పవు. కాబట్టి మనకు తినే ఆహారంలోనే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలను చేర్చుకుంటే సరిపోతుంది అంటున్నారు.
క్యారెట్, పాలకూర:
ఇవి రెండూ మనకు చాలా హెల్స్ అయ్యే కూరగాయలు. కాల్షియమే కాదు ఇంకా చాలా రకాల విటమిన్లు, బెనిఫిట్స్ ఈ రెండింటి వల్లా వస్తాయి. అయితే ఈ రెండూ వేరేవరేగా తింటాము మనం జనరల్ గా. కానీ ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మనకు అంతులేని కాల్షియం దొరుకుతుందిట. క్యారెట్, పాలకూర జ్యూస్ తరచుగా తీసుకుంటే.. ఎముకలు స్ట్రాంగ్ అవుతాయని పోషకాహార నిపుణులు చబెతున్నారు. ఈ జ్యూస్ నుంచి దాదాపు.. 300 మిల్లీగ్రాముల కాల్షియం పొందవచ్చు. ఈ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి.
పప్పులు:
పప్పులలో ప్రోటీన్లు ఉంటాయన్న సంగతి మనకందరికీ తెలిసిందే. కానీ ఇందులో కాల్షియం కూడా అధికంగా ఉంటుందిట. అందుకే మన రోజు వారీ డైట్ లో పప్పులను కచ్చితంటా చేర్చుకోవాలని చెబుతున్నారు. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. కిడ్నీ బీన్స్, శనగ పప్పు, కందిపప్పు, పెరసర పప్పు ఎక్కువగా తీసుకోవాలి. 100 గ్రాముల పప్పు తీసుకుంటే.. మీకు దాదాపు 200 నుంచి 250 మిల్లీగ్రాముల కాల్షియం పొందవచ్చు.
నువ్వులు:
రోజూ రెండు మూడు టీస్పూన్ల నువ్వులు తింటే.. 1400 mg కాల్షియం పొందవచ్చు. నువ్వులను బెల్లంతో కలిపి కూడా తీసుకోవచ్చు. కూరల్లో, పచ్చళ్లలో నవ్వులు వేసుకుని డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నువ్వుల్లో రాగి, మెగ్నీషియం, కాల్షియం, ఆరోగ్యకరమైన ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ప్రోటీన్ కూడా అధికంగా ఉంది. ఈ పోషకాలన్నీ ఎముకల సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తాయి.
రాగి:
అందరికీ అందుబాటులో ఉండే మిల్లెట్ రాగి. దాదాపు ఏ దేశం వెళ్ళినా కూడా ఇది దొరుకుతుంది. అటువంటి రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను ధృడంగా చేయడానికి సహాయపడుతుంది. రాగులు పిల్లలకు, వృద్ధులకు మంచి ఆహారం. రాగులు ఆహారంలో తీసుకుంటే.. ఎముకుల గుల్లబారడం, పగుళ్లు వంటివి జరగకుండా ఉంటుంది. రోజూ రాగి జావను తాగొచ్చు. ఉదయం టిఫెన్‌గా.. మొలకెత్తిన రాగులను తినవచ్చు. దీంతోపాటు రాగి పిండితో ఇడ్లీలు, దోశలను తయారు చేసుకొని తినవచ్చు.
ఇక మాంసాల విషయానికి వస్తే సార్డిన్ ఫిష్ లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. కాల్షియం లోపం ఉన్నవారు సార్డిన్ ఫిష్ తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇది కాకుండా అంజీర్, బ్రోకలీ, మిల్లెట్స్ లాంటివాటిల్లో కూడా కాల్షియం ఉంటుంది. పాలు, ఛీజ్, సన్నీర్, అరటిపండ్లు ఇవన్నీ అందరికీ తెలిసిన కాల్షియం రిచ్ ఫుడ్. కాబట్టి అప్పుడప్పుడూ వాటిని కూడా తీసుకుంటూ ఉంటాలి.
ఇవి కూడా చదవండి :
బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా?