మేడారం కానుకల లెక్కింపు.. పది కోట్లు దాటిన ఆదాయం - MicTv.in - Telugu News
mictv telugu

మేడారం కానుకల లెక్కింపు.. పది కోట్లు దాటిన ఆదాయం

March 1, 2022

medarm

తెలంగాణలో ఇటీవల అత్యంత వైభవంగా జరిగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా.. 497 హుండీలకు గాను 450 హుండీలలో లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు పదికోట్ల ఆదాయం రాగా, బంగారు, వెండి, విదేశీ కరెన్సీ విలువను లెక్కించాల్సి ఉంది. ఇవి కూడా పూర్తయితే గత జాతరలో వచ్చిన 11,64,00,000 రూపాయలను అధిగమించే అవకాశాలున్నాయి. కాగా, కరోనా ప్రభావం ఉన్నా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

అంతకుముందు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో ప్రజల ఉపాధి అవకాశాలు తగ్గి ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో కానుకలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ వాటిని తల కిందులు చేస్తూ గత జాతర రికార్డును బద్దలు కొట్టేలా ఉంటుందని ఊహించలేదని పలువురు అధికారులు పేర్కొన్నారు. మొత్తం లెక్కింపు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు వారు తెలిపారు.