ఇదేం వింత..ఐదు రోజుల లేగదూడ పాలు ఇస్తోంది - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేం వింత..ఐదు రోజుల లేగదూడ పాలు ఇస్తోంది

February 22, 2020

Calf Giving Milk in Nirmal

అప్పుడే పుట్టిన లేగదూడ పాల కోసం తపిస్తుండటం చూసి ఉంటాం. కానీ ఓ లేగదూడ మాత్రం వింతగా అదే లీటర్ల కొద్ది పాలు ఇస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అది పుట్టి కేవలం 5 రోజులు కూడా కాలేదు అప్పుడే ఆవులా పాలు ఇవ్వడం చూసి జనం ఇదేం వింత అని చర్చించుకుంటున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం కొత్తలోలం గ్రామంలో ఇది చోటు చేసుకుంది. ఈ విషయం ఆనోటా ఈనోటా అందరికి తెలిసిపోయింది. దీంతో ఈ దూడను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 

మహ్మద్‌ అజారుద్దీన్‌ అనే పాడిరైతుకు కొన్ని ఆవులు ఉన్నాయి. వాటి పాల ద్వారా అతడు జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి చెందిన డైరీఫామ్‌లో ఓ జెర్సీ ఆవు ఐదురోజుల క్రితం లేగదూడకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం దాని పొదుగు పెద్దది కావడాన్ని ఆ రైతు గమనించాడు. ఏం జరుగుతుందని అతనికి అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని దాన్ని తడిమి చూశాడు. వెంటనే పొదుగు నుంచి పాలు కారడం ప్రారంభం అయ్యాయి. చిన్న లేగదూడ పాలు ఇవ్వడం ఏంటని వెంటనే పశువైద్యులను సంప్రధించాడు. వారు పరీక్షించి అది హర్మోన్ల ప్రభావంగా గుర్తించారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని చెప్పాడు.