California Commissioner raghu reddy Appeal to munugode Voters
mictv telugu

మునుగోడు ఓటర్లకు కాలిఫోర్నియా కమిషనర్ విజ్ఞప్తి

November 2, 2022

California Commissioner raghu reddy Appeal to munugode Voters

మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం ఇప్పటికే ముగియగా, గురువారం పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని కాలిపోర్నియా నగర కమిషనర్ మునుగోడు ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ప్రతిపక్షాలతో పోల్చి చూస్తే అధికార టీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి పట్ల నిబద్దతతో ఉందని, టీఆర్ఎస్‌ను గెలిపించడం తెలివైన పని అని సూచించారు. నియోజకవర్గ డెవలప్ మెంట్ అంతా కేటీఆర్ చూసుకుంటారని భరోసా ఇచ్చారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని తర్వాత ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో చూడాలని విన్నవించారు. కాలిఫోర్నియా నగర కమిషనర్‌గా మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డిలను తాను కలిశానని అంకిత భావం, చలనశీలత కలిగిన వ్యక్తులుగా వారిని గమనించానని అభిప్రాయపడ్డారు. కాగా, సూర్యాపేటకు చెందిన రఘు రెడ్డి కాలిఫోర్నియా నగర కమిషనర్‌గా నిలిచిన తొలి ప్రవాస భారతీయుడిగా పేరు గాంచారు.