కరోనా సోకాక కండల వీరుడు ఇలా..ఎవడైతే నాకేంటి? - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా సోకాక కండల వీరుడు ఇలా..ఎవడైతే నాకేంటి?

May 22, 2020

california Coronavirus Survivor Shares Shocking Body Transformation Pics

ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రజలు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. అయితే, కరోనా సోకకముందు కరోనాను జయించిన తరువాత వారి శరీరాల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. ఇటీవల కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి కోలుకున్నాడు. అతడు కరోనా ముందు కరోనాకు తరువాత తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..మైక్‌ షుల్ట్‌జ్ అనే వ్యక్తి మార్చిలో కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఆరు వారాల పాటు వెంటిలేటర్ పై ఉండి కరోనాను జయించాడు. ఈ క్రమంలో మైక్ దాదాపు 23 కిలోల బరువు తగ్గాడు. దీంతో కరోనా వైరస్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడానికి మైక్ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ సందర్భంగా మైక్ మాట్లాడుతూ..’కరోనాకు ముందు నా బరువు 86 కిలోలుండేది. కరోనా తర్వాత నా బరువు 63 కిలోలకు పడిపోయింది. మీరు ఆరోగ్య వంతులైనప్పటికీ కూడా ఈ మహమ్మారి మిమ్మల్ని ప్రభావితం చేయగలదు. నేను వారానికి ఆరు నుంచి ఏడు సార్లు జిమ్‌లో కసరత్తు చేసేవాడిని. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న మయామి బీచ్‌లో మార్చిలో జరిగిన ఓ పార్టీకి హాజరయ్యాను. అందువల్లే నాకు కరోనా సోకింది. దీంతో నేను న్యూమోనియతో బాధపడ్డాను. దీంతో వైద్యులు నన్ను వెంటిలేటర్‌పై ఉంచారు. నేను స్వయంగా శ్వాస తీసుకోవడానికి 4 వారాల సమయం పట్టింది. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం మళ్లీ జిమ్ములో కసరత్తు మొదలుపెట్టాను’ అని తెలిపాడు. ప్రస్తుతం మైక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.